Faf du Plessis: మా ఓటమికి అదే కారణమైంది..: ఫాఫ్ డుప్లెసిస్

  • తాము గొప్పగా బ్యాటింగ్ చేశామన్న ఆర్సీబీ కెప్టెన్
  • ఫినిషింగే బాగాలేదని అంగీకారం
  • దినేష్ కార్తీక్ మ్యాచ్ ను ఫినిష్ చేస్తాడని భావించినట్టు వెల్లడి
  • చెన్నై బౌలర్లకు ప్రశంసలు
Couldve minimized the damage by restricting them says Faf du Plessis after last ball loss vs CSK

పోరాడినా కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఓటమి తప్పలేదు. చెన్నై చేతిలో 8 పరుగుల తేడాతో సోమవారం నాటి మ్యాచ్ లో ఓడిపోయింది. దీనిపై మ్యాచ్ అనంతరం జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మీడియాతో మాట్లాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ ను నియంత్రించడం ద్వారా నష్టాన్ని పరిమితం చేసుకోగలిగినట్టు చెప్పాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 226 పరుగులు చేయగా, చివరి ఓవర్లో బెంగళూరు ఓటమి ఖాయం చేసుకుంది.

తాము ఛేదనలో చాలా బాగానే పనితీరు చూపించినట్టు ఫాఫ్ డుప్లెసిస్ చెప్పాడు. కాకపోతే దినేష్ కార్తీక్ మ్యాచ్ ను ముగిస్తాడని ఆశించగా, చెన్నై బౌలర్లు చక్కని బౌలింగ్ తో అడ్డుకట్ట వేసినట్టు అంగీకరించాడు. చివరి ఓవర్ లో ఆర్సీబీ 19 పరుగులు చేయాల్సి ఉండగా, మహేష్ పతిరణ అద్భుత బౌలింగ్ తో ఆర్సీబీని కట్టడి చేయడం తెలిసిందే. 

‘‘మ్యాచ్ మొదట్లో నేను చేసిన డైవింగ్ (క్యాచ్) కారణంగా నా పక్కటెముకలకు గాయమైంది. అది అసౌకర్యానికి కారణమైంది. మేము చాలా చక్కగానే బ్యాటింగ్ చేశాం. చివరి ఐదు ఓవర్లలో ఫినిషింగ్ కు అనుకూల పరిస్థితులను కల్పించాం. దినేష్ కార్తీక్ ఈ పని చేయాల్సి ఉంది. అది అతడికి వెన్నతో పెట్టిన విద్యే. కానీ, చెన్నై బౌలర్లు ఎంత చక్కగా బంతులు వేశారో తెలుస్తోంది. 200 పరుగులకు చెన్నైని కట్టడి చేయాల్సింది. కానీ మేము కొంత ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నాం. బ్యాటర్లకు ఇది చక్కని వేదిక. కనుక బౌలర్ గా ఈ వికెట్ పై నైపుణ్యంతో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. సిరాజ్ నమ్మశక్యం కాని విధంగా చేశాడు. కాకపోతే గొప్పగా ఫినిష్ చేయలేకపోయాం’’అని ఓటమి కారణాలను డుప్లెసిస్ వివరించాడు.

More Telugu News