MS Dhoni: కుంటుతూ బస్ ఎక్కుతున్న ధోనీ వీడియో వైరల్.. అభిమానుల్లో ఆందోళన

Viral Video Of MS Dhoni Limping Raises Concerns Over His Fitness Status
  • ధోని ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన పెంచిన వీడియో
  • సీఎస్‌కే కెప్టెన్ కుంటడం చూసి ఫ్యాన్స్ విచారం
  • గాయం బాధిస్తున్నా ఫ్యాన్స్ కోసం ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడని ప్రశంసలు
సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడంటూ టీం హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గతవారం చేసిన ప్రకటన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఇలాంటి టైంలో ధోనీ కుంటుతూ బస్ ఎక్కుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతూ అభిమానుల్లో టెన్షన్ మరింత పెంచేసింది. వచ్చే ఏడాది ఐపీఎల్ లో ధోనీ ఆడేదానిపై అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో ఈ వీడియో ధోనీ ఫ్యాన్స్‌లో నిరాశ నింపింది. 

‘‘వికెట్ల మధ్య మెరుపులా దూసుకుపోయే ధోనీని ఇలా చూస్తుంటే విచారం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ధోని టీం కోసం తాను చేయగలిగినదంతా చేస్తూ స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాడు’’ అని కొందరు కామెంట్ చేశారు. 

మహీ ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు కావాలని మరికొందరు ట్విట్టర్ వేదికగా కోరారు. ‘‘ఈ సీజన్ మహీకి చివరిదిలా కనిపిస్తోంది. అభిమానులను నిరాశ పరచొద్దనే ఉద్దేశంతో ధోని ప్రతి మ్యాచ్ ఆడుతున్నట్టుగా ఉంది’’ అన్న కామెంట్స్ కూడా వచ్చాయి.
MS Dhoni

More Telugu News