Probation: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Probation for village and ward secretariat employees
  • 2020 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్
  • శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ప్రొబేషన్
  • రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడం తప్పనిసరి
  • మే 1 నుంచి కొత్త పే స్కేళ్లు
ఏపీ సర్కారు 2020 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ప్రకటించింది. శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్ ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొబేషన్ అందుకున్న వారికి మే 1 నుంచి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయ శాఖ వెల్లడించింది. 

ప్రొబేషన్ ద్వారా సచివాలయ ఉద్యోగాలకు భద్రత ఏర్పడినట్టయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే సచివాలయ సిబ్బంది నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సచివాలయ సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు వీలు కల్పించే ప్రొబేషన్ డిక్లరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆమోదం తెలిపింది.
Probation
Village/Ward Secretariate
Employees
YSRCP
Andhra Pradesh

More Telugu News