Advertisement

జగన్ లండన్ పర్యటన రద్దు?

Jagan London tour
  • ఈ నెల 21న లండన్ కు వెళ్లాల్సిన జగన్
  • అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం
  • నిన్ననే అవినాశ్ తండ్రిని అరెస్ట్ చేసిన సీబీఐ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లాలనుకున్న సంగతి తెలిసిందే. పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 21న ఆయన లండన్ కు బయల్దేరాల్సి ఉంది. విజయవాడ నుంచి ముంబైకు ప్రత్యేక విమానంలో వెళ్లి, అక్కడి నుంచి లండన్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే ఆ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. తన బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని చెపుతున్నారు. నిన్ననే అవినాశ్ రెడ్డి తండ్రిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ తన అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఈనాటి అనంతపురం పర్యటనకు కూడా ముఖ్యమంత్రి వెళ్లలేదు. లండన్ పర్యటన రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Jagan
YSRCP
London

More Telugu News