YS Avinash Reddy: సీబీఐ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లిపోయిన అవినాశ్ రెడ్డి

YS Avinash Reddy return backs to home from CBI office
  • హైకోర్టులో ముందస్తు పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు
  • రేపు ఉదయం 10.30కు విచారణకు రావాలన్న సీబీఐ
  •  అనుచరులతో కలిసి ఇంటికి వెళ్లిపోయిన అవినాశ్
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈరోజ విచారణను ఆపివేయాలని సీబీఐని అవినాశ్ తరపు లాయర్లు కోరారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని అవినాశ్ ను సీబీఐ ఆదేశించింది. అవినాశ్ కు ఆరోసారి నోటీసులను జారీ చేసింది. సీబీఐ విచారణ రేపటికి వాయిదా పడటంతో ఆయన తన అనుచరులతో కలిసి హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు అవినాశ్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇరువైపు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తున్నారు.
YS Avinash Reddy
YSRCP
CBI

More Telugu News