మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- సీబీఐ కేసులో 27 వరకు, ఈడీ కేసులో 29 వరకు
- కేజ్రీవాల్ విచారణ మరుసటి రోజే కస్టడీ పొడిగింపు
మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఫిబ్రవరి నెలలో సిసోడియాను అరెస్ట్ చేసింది. అంతకుముందు పలుమార్లు విచారించిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది. విచారణకు ఆయన సహకరించడం లేదని, సరైన సమాధానాలు చెప్పడం లేదని చెబుతూ, ఆయన ముందు సాక్ష్యాలు పెట్టి విచారించినప్పటికీ సరైన సమాధానం చెప్పడం లేదని చెబుతూ సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మార్చి నెలలో ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆయనను ఈడీ తీహార్ జైల్లో విచారించింది.