తన కుమారుడి తొలి ఐపీఎల్ ప్రదర్శనపై స్పందించిన సచిన్
- క్రికెటర్ గా నేడు కీలక అడుగు వేశావన్న సచిన్
- ఇక్కడకు చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డావంటూ ప్రశంస
- అందమైన ప్రయాణానికి ఇది ఆరంభమేనని ప్రకటన
మ్యాచ్ తర్వాత తన కుమారుడి ప్రదర్శనను అభినందిస్తూ సచిన్ ట్వీట్లు చేశారు. అర్జున్ సోదరి సరా కూడా ఎమోజీలతో స్పందించింది.‘‘అర్జున్ క్రికెటర్ గా ఈ రోజు నీవు మరో కీలక అడుగు ముందుకు వేశావు. నీ తండ్రిగా, నిన్ను ప్రేమించే వాడిగా, క్రికెట్ ను ఎంతో ఇష్టపడేవాడిగా, నీవు ఆటకు గౌరవాన్ని తీసుకువస్తావని, అదే ఆట తిరిగి నిన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసు. ఇక్కడకు చేరుకోవడానికి నీవు ఎంతో కష్టపడ్డావు. దీన్ని కొనసాగిస్తావని నేను నమ్మకంగా చెప్పగలను. అందమైన ప్రయాణానికి ఇది ఆరంభమే. నీకు అంతా మంచే జరగాలి’’ అని సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశాడు.