MS Dhoni: ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్: కేదార్ జాదవ్

This IPL season may be last one for Dhoni says Kedar Jadhav
  • ధోనీ రిటైర్మెంట్ పై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు
  • ధోనీకి వయసు పెరుగుతోందన్న కేదార్ జాదవ్
  • ఇకపై అతనికి శరీరం సహకరించకపోవచ్చని వ్యాఖ్య
మన దేశ క్రికెట్ ను కెప్టెన్ గా పరుగులు పెట్టించిన ధోనీ కెరీర్ చివరి అంకానికి చేరినట్టే కనిపిస్తోంది. ధోనీ రిటైర్మెంట్ గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనీ ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. మరోవైపు ధోనీ కెరీర్ పై టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ స్పందించాడు. ధోనీకి వయసు పెరుగుతోందని, దీంతో ఆయనపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపాడు. ఇకపై క్రికెట్ ఆడేందుకు అతని శరీరం సహకరించకపోవచ్చని చెప్పాడు. బహుశా ఇదే అతనికి చివరి ఐపీఎల్ కావచ్చని అన్నాడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఉండబోతోందనేదే ఆసక్తికర విషయమని చెప్పాడు. ఈ ఐపీఎల్ లో గత నాలుగు మ్యాచ్ లలో ధోనీ స్ట్రయిక్ రేట్ 214.81గా ఉంది.
MS Dhoni
Kedar Jadhav
IPL

More Telugu News