Australia: స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్

Australian Womens Star Jess Jonassen Marries With Best Friend Sarah Wearn
  • సారా వెర్న్ తో ఆసీస్ ఆల్రౌండర్ జెస్ జోనాసెన్ వివాహం
  • డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీకి ఆడిన జోనాసెన్
  • స్వలింగ వివాహ జాబితాలో క్రికెటర్లు మెగాన్‌ షట్‌, మరిజానె కాప్‌, సాటర్త్‌వైట్‌ 
స్వలింగ వివాహ జాబితాలో మరో మహిళా క్రికెటర్ చేరింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్ రౌండర్ జెస్ జోనాసెన్ తన దీర్ఘకాల స్నేహితురాలు, ప్రియురాలు సారా వెర్న్ ను పెళ్లి చేసుకుంది. చాన్నాళ్ల నుంచి స్నేహితులుగా, ప్రేమికులుగా ఉన్న ఈ ఇద్దరూ శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ పెళ్లి విషయాన్ని జోనాసెన్ శుక్రవారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటింటింది. హవాయిలో సముద్రం ఒడ్డున బీచ్ లో జరిగిన వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 2020 మేలోనే పెళ్లి చేసుకుంటామని ఈ ఇద్దరూ ప్రకటించారు. కానీ, కరోనా కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో పెళ్లి జరిగింది. 

ఈనెల 6న హవాయి ద్వీపంలో అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ తేదీకి తన హృదయంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని జోనాసెన్ ట్వీట్ చేసింది. కాగా, ఆసీస్‌ జట్టులో కీలక ఆల్‌రౌండరైన 30 ఏళ్ల జొనాసెన్‌ ఐదుసార్లు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌లో సభ్యురాలు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గిన ఆసీస్‌ జట్టులోనూ కీలకంగా ఉన్న ఆమె ఈ ఏడాది భారత్‌లో జరిగిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కాగా, మెగాన్‌ షట్‌, మరిజానె కాప్‌, అమీ సాటర్త్‌వైట్‌ లాంటి పలువురు మహిళా స్టార్‌ క్రికెటర్లు ఇదివరకే తమ ప్రియురాళ్లను పెళ్లాడారు. ఇప్పుడు ఈ జాబితాలో జోనాసెన్ కూడా చేరింది.
Australia
Cricketer
women
Jess Jonassen
Sarah Wearn

More Telugu News