Harbhajan Singh: హర్భజన్ దృష్టిలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ కోహ్లీ, బాబర్ కాదు.. మరెవరో తెలుసా?

Jose Butler is world no 1 batsman says Harbhajan Singh
షార్ట్స్‌లో చూడండి
రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ పై టీమిండియా మాజీ స్పిన్నర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచంలో నెంబర్ 1 బ్యాట్స్ మెన్ బట్లర్ అని కితాబునిచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో బట్లర్ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన బట్లర్... 204 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. 

ఈ క్రమంలో హర్భజన్ మాట్లాడుతూ బట్లర్ ను ఎలా పొగడాలో కూడా అర్థం కావడం లేదని చెప్పాడు. వైట్ బాల్ క్రికెట్లో అద్భుతంగా అడతాడని, క్రీజ్ ను పూర్తిగా ఉపయోగించుకుంటాడని తెలిపాడు. బట్లర్ బ్యాటింగ్ టెక్నిక్ చాలా గొప్పగా ఉంటుందని, స్పిన్నర్లను కూడా అలవోకగా ఎదుర్కోగలడని ప్రశంసించాడు. ప్రపంచ టీ20ల్లో కోహ్లీ, బాబర్ ఆజం, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్లు మెరుపులు మెరిపిస్తుంటారు. అయితే, బెస్ట్ బ్యాట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు హర్భజన్ వీరి పేర్లను కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
Go Back to Shorts
Harbhajan Singh
Jose Butler

More Telugu News