సన్నజాజిని పోలిన సౌందర్యమే పూజ హెగ్డే!: లేటెస్ట్ పిక్స్

Pooja Hegde Special
బాలీవుడ్లో హీరోయిన్స్ మధ్య ఏ స్థాయిలో పోటీ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అలాంటి చోట హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోవడం .. నెగ్గుకు రావడం అనుకున్నంత తేలిక కాదు. పూజ హెగ్డే ముంబై భామనే .. అయినా ఆమె కెరియర్ తమిళ సినిమాతోనే మొదలైంది .. తెలుగు సినిమాల కారణంగానే ఆమెకి స్టార్ డమ్ వచ్చింది. ఆ తరువాతనే ఆమెకి బాలీవుడ్ లో ఫస్టు మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో చేసిన సినిమా ఫ్లాప్ అయిన తరువాత, ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె టాలీవుడ్ కి తిరిగొచ్చేసి తెలుగు సినిమాలు చేస్తూ వెళ్లింది. ఆమె తీసుకున్న ఆ తెలివైన నిర్ణయమే ఇప్పుడు ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది. మళ్లీ బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చేలా చేసింది. తెలుగుకి ప్రాధాన్యతనిస్తూ .. వీలును బట్టి తమిళ .. హిందీ భాషల్లో చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్లింది. ఇప్పుడు ఆమె ఏకంగా సల్మాన్ జోడీగా 'కిసీ కా భాయ్ .. కిసీ కి జాన్' సినిమాలో చేసింది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. ఈ నేపథ్యంలో ఆమె లేటెస్ట్ స్టిల్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె నాజూకుదనానికి కేరాఫ్ అడ్రెస్ గా అనిపిస్తూ .. అజంతా శిల్పాల మాదిరిగా కనిపిస్తూ .. అప్సరసలను తలపిస్తోంది. కాడమల్లె పూవు లాంటి ఆమె సోయగమే ఇప్పుడు అక్కడ మిగతా హీరోయిన్స్ ను కంగారుపెడుతోంది. సల్మాన్ తో చేసిన సినిమా హిట్ అయితే సంపెంగ రేకులంటి ఈ సౌందర్యరాశిని పట్టుకోవడం కష్టమే.
Go Back to Shorts
Salman Khan
Venkatesh Daggubati
Jagapathibabu
Pooja Hegde

More Telugu News