Vikram: 'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి 'శివోహం' లిరికల్ వీడియో!

Ponniyin Selven lyrical released
షార్ట్స్‌లో చూడండి
మణిరత్నం దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో వచ్చిన సినిమానే 'పొన్నియిన్ సెల్వన్ 1'. విక్రమ్ .. కార్తి .. జయం రవి .. ఐశ్వర్య రాయ్ .. త్రిష ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. మిగతా భాషల్లో విజువల్ వండర్ అనిపించుకుంది. 

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'పొన్నియిన్ సెల్వన్ 2' రూపొందింది. ఫస్ట్ పార్టు విడుదల సమయానికే సెకండ్ పార్టుకి సంబంధించిన చాలా భాగం చిత్రీకరణ జరుపుకోవడం వలన, రెండు భాగాల మధ్య గ్యాప్ ఎక్కువగా లేదు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఒక్కో పాటను వదులుతూ వస్తున్నారు. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'శివోహం .. శివోహం' అనే లిరికల్ వీడియోను వదిలారు. ఆదిశంకరుల విరచితమైన 'నిర్వాణ శతకం' లోనిది ఇది. రెహ్మాన్ (రఘు)తో పాటు కొంతమంది సాధువులపై దీనిని చిత్రీకరించారు. ఈ భాగంలో ఆయన పాత్ర ప్రాధాన్యతను ఈ లిరికల్ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. 
Go Back to Shorts
Vikram
Aishwarya Rai
Karthi
Trisha
Rehman

More Telugu News