ముంబయి ఇండియన్స్ ఇవాళైనా గెలిచేనా...?

Mumbai Indians takes in Delhi Capitals
  • నేడు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ × ముంబయి ఇండియన్స్
  • పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రెండు జట్లు
  • ఇప్పటిదాకా టోర్నీలో గెలుపు బోణీ కొట్టని జట్లు ఇవే!
రికార్డు స్థాయిలో ఐదుసార్లు ఐపీఎల్ విజేత ముంబయి ఇండియన్స్... తాజా సీజన్ లో గెలుపు కోసం తహతహలాడుతోంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడగా, రెండింటా ఓడిపోయిన ముంబయి ఇండియన్స్, పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉన్న ఢిల్లీ కంటే ఒక మెట్టు పైన ఉంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. ఈ పోరులో ముంబయి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ లో ముంబయి ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ సీజన్ లో ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. ఆడిన 3 మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. దాంతో ఢిల్లీ జట్టుకు కూడా ఈ మ్యాచ్ ముఖ్యమైనదే. రెండు జట్లలోనూ హేమాహేమీలు ఉన్నా, సమష్టితత్వం కొరవడడంతో ఓటములు తప్పడంలేదు. 

ఇక, జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్ లోనూ ఆడడంలేదని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ట్రిస్టాన్ స్టబ్స్ స్థానంలో రిలే మెరిడిత్ ఆడుతున్నాడని తెలిపాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. గాయపడిన ఖలీల్ అహ్మద్ స్థానంలో యశ్ ధూల్ తుదిజట్టుకు ఎంపికయ్యాడు. రిలీ రూసో స్థానంలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు.
Go Back to Shorts
Mumbai Indians
Delhi Capitals
Toss
IPL

More Telugu News