పది భాషల్లో సూర్య సినిమా .. టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఆ రోజునే!
- సూర్య నుంచి మరో ప్రయోగాత్మక చిత్రం
- కెరియర్ పరంగా ఇది ఆయనకి 42వ సినిమా
- ఈ నెల 16వ తేదీన సినిమా టైటిల్ రిలీజ్
- కథానాయికలుగా నయనతార .. దిశా పటాని
ఈ సినిమా కథాకథనాలు విభిన్నంగా ఉండనున్నాయి. అందువలన టైటిల్ ఎలా ఉండనుందనేది అభిమానులలో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 9:05 నిమిషాలకు టైటిల్ ను ప్రకటించనున్నట్టు చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు.
అటవీ ప్రాంతంలో విల్లంబులు ధరించి గుర్రాలపై వేటాడే ఒక వేటగాడు, ఆ గుర్రంపై ఒక కొండ కొస నుంచి మరో కొండపైకి జంప్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. పక్కనే ఆ గుర్రాన్ని అనుసరిస్తూ వేటకుక్క కూడా కనిపిస్తోంది. నయనతార .. దిశా పటాని కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. పది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.