Chat GPT: ఆరోగ్యకరమైన టిఫిన్ ఏదన్న ప్రశ్నకు చాట్ జీపీటీ ఇచ్చిన జవాబు ఏంటంటే..!

  • తృణధాన్యాలతో చేసిన రొట్టెలు లేదా ఓట్స్ తీసుకోవాలన్న చాట్ జీపీటీ
  • గుడ్లు, పెరుగు, చీజ్ లను అల్పాహారంలో చేర్చాలని సూచన
  • తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వెల్లడి
What is a healthy tiffin asked Chat GPT answer is

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ ట్రెండ్ నడుస్తోంది.. చాట్ జీపీటీ ఇచ్చే సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చాట్ జీపీటీ ఏంచెబుతుందో తెలుసుకోవడానికే ప్రశ్నలు అడుగుతున్నారు. ఇటీవల హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయికి బెయిల్ ఇవ్వొచ్చా లేదా అని చాట్ జీపీటీని ప్రశ్నించారు. అయితే, కేవలం జవాబు ఏమొస్తుందో తెలుసుకోవడానికే ఆ ప్రశ్న అడిగామని, ఆ జవాబు తమ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదని సదరు న్యాయమూర్తి తర్వాత వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే ఆరోగ్యకరమైన అల్పాహారం ఏదని అడిగితే చాట్ జీపీటీ పలు రకాల పదార్థాలను రికమెండ్ చేసింది. చాట్ జీపీటీ చెప్పిన జవాబు ఏంటంటే.. శరీరానికి అవసరమైన పోషకాలు కలిగి ఉన్నదే ఆరోగ్యకరమైన అల్పాహారం అని చెప్పింది. తృణధాన్యాలతో చేసిన రొట్టెలు లేదా ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్‌ని అల్పాహారంగా తీసుకోవాలని సూచించింది. గుడ్లు, పెరుగు, చీజ్‌తో పాటు గింజలు/విత్తనాలు వంటి ప్రోటీన్ పదార్థాలను అల్పాహారంలో చేర్చుకోవాలని తెలిపింది.

విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీలు, అరటిపండ్లు, అవకాడో, బచ్చలికూర లేదా టమోటాలు వంటి పండ్లు, కూరగాయలను బ్రేక్ ఫాస్ట్ మెనూలో చేర్చుకోవాలని సూచించింది. గింజలు, అవకాడోలు లేదా వెన్న వంటి హెల్తీ ఫ్యాట్ ను ఉదయాన్నే తీసుకోవడం శరీరానికి మంచిదని పేర్కొంది. పాలు లేదా పాల పదార్థాలను తప్పనిసరిగా రోజూ తీసుకోవాలని, బాదం పాలు, కొబ్బరి పాలు లేదా సోయా మిల్క్‌ తీసుకున్నా శరీరానికి మేలు కలుగుతుందని చాట్ జీపీటీ వెల్లడించింది.

More Telugu News