ముస్లింలు పాకిస్థాన్ లో కంటే ఇండియాలోనే ఎక్కువ సంతోషంగా ఉన్నారు: నిర్మలా సీతారామన్
- ఇండియాలో ముస్లింలు హింసకు గురవుతున్నారన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన నిర్మల
- అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉందని వ్యాఖ్య
- వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని హితవు
పాకిస్థాన్ లో మైనార్టీల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోందని విమర్శించారు. పాక్ లో మైనార్టీల జనాభా నానాటికీ తగ్గుతోందని అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా భారత్ పై అసత్య ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. వాషింగ్టన్ లోని పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో జరిగిన చర్చా వేదికలో ఆమె ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.