జగన్ ను ఓడించేందుకు పార్టీ పెట్టావా?: పవన్ కు అంబటి రాంబాబు ప్రశ్న
- జనసేన ఎందుకు పెట్టాడో పవన్ కే తెలియదన్న అంబటి
- టీడీపీ, జనసేనలకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని వ్యాఖ్య
- జగన్ మళ్లీ గెలవడం ఖాయం అన్న అంబటి
మీ కోసం నేను మంచి చేశాను, నేను చేసిన మంచి మీకు నచ్చితే నన్ను మళ్లీ గెలిపించి ఆశీర్వదించండి అని ధైర్యంగా ప్రజలను అడగగలిగిన ముఖ్యమంత్రి ఒక్క జగన్ మాత్రమేనని చెప్పారు. ఎవరు ఎంతమందితో కలిసి వచ్చినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న అంబటి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.