'విరూపాక్ష' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు .. వేదిక ఎక్కడంటే ..!
- సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష'
- ఆసక్తిని రేపుతూ వచ్చిన అప్ డేట్స్
- రేపు ఉదయం రిలీజ్ కానున్న ట్రైలర్
- ఈ నెల 16వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 21వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. అందుకు ఏలూరులోని 'సీఆర్ రెడ్డి కాలేజ్' వేదిక కానుంది. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.
ఇక రేపు ఉదయం 11:07 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా కొంతసేపటి క్రితం వదిలారు. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వచ్చాయి. ప్రమాదం కారణంగా గ్యాప్ తీసుకున్న సాయితేజ్, ఈ సినిమాతో హిట్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. వాళ్ల నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.