Samantha: కెమెరా ముందు ఉన్నంత వరకే నేను స్టార్ ని: సమంత

  • ఈ నెల 14వ తేదీన 'శాకుంతలం' విడుదల
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సమంత 
  • యాక్షన్ సినిమాలు చేయాలనుందని వ్యాఖ్య  
  • అర్హ గొప్పగా నటించడం పట్ల హర్షం  
  • షూటింగు లేకపోతే సాదా సీదాగానే ఉంటానని వెల్లడి
Samantha Interview

శ‌కుంత‌ల దుష్యంతుల అమ‌ర‌ప్రేమ‌గాథ 'శాకుంత‌లం' ఈ నెల 14న విడుద‌ల కానుంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గురించి ముంబై మీడియాతో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను పంచుకున్నారు స‌మంత. అజ‌రామ‌ర‌మైన ప్రేమ‌గాథ గురించి స‌మంత మాట్లాడుతూ .. 'శాకుంత‌లం' సినిమాలో యువ‌రాణిగా న‌టించ‌డం చాలా ఆనందంగా, ప్ర‌త్యేకంగా అనిపించింది. ఆ పాత్ర‌లో అంత ప‌ర్ఫెక్ట్ గా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. 
 
'శాకుంత‌లం' క‌థ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు చాలా ఆలోచించాను .. కాస్త భ‌య‌ప‌డ్డాను. కానీ, కొన్నేళ్లుగా సవాళ్ల‌ను స్వీక‌రించ‌డం నాకు అల‌వాటైపోయింది. నిర్మాత దిల్‌ రాజుగారికి స్క్రిప్ట్ మీద చాలా న‌మ్మ‌కం ఉంది. నా చిన్న‌త‌నంలో శ‌కుంత‌ల పాత్ర గురించి చాలా క‌ల‌లు క‌నేదాన్ని. అమ్మాయిలు, మ‌హిళ‌లు, ఫ్యామిలీలు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పాత్ర‌లో న‌టిస్తున్నంత సేపు ఓ ప్రేక్ష‌కురాలిగా ఆస్వాదించాను" అని చెప్పారు. 

 ఇది సింపుల్‌గా చెప్పేసే క‌థ కాదు. ఇందులో ప్రేమ ఉంది .. మోసం ఉంది. అంతకు మించిన భావోద్వేగాలు చాలానే ఉన్నాయి. ఎన్నో శ‌తాబ్దాల‌కు పూర్వం రాసిన క్లిష్ట‌మైన క‌థ ఇది. స‌కుటుంబ‌స‌ప‌రివార స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా ఇది. మండు వేస‌విలో కుటుంబ‌మంతా కూర్చుని చూడాల్సిన సినిమా ఇది .. సిద్ధంగా ఉండండి" అని అన్నారు. 

``నా దృష్టిలో ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ గారు ఫెమినిస్ట్. ఆయ‌న ఫీమేల్ ఓరియంటెడ్ క‌థ‌లు రాస్తారు. రిస్క్ తీసుకోవ‌డానికి భ‌య‌ప‌డ‌రు. గొప్ప గొప్ప క‌థ‌ల‌ను మహిళ‌ల చుట్టూ ఆస‌క్తిక‌రంగా న‌డ‌పాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. అల్లు అర్హ విషయానికి వస్తే, త‌నకు కావాల్సిన నిర్ణ‌యాలు తానే తీసుకోగ‌ల‌దు. ఆమె కెరీర్ గురించి బన్నీ ఆలోచన చేయవలసిన పని లేదు. ఆమె కెరీర్‌లో ఇది అద్భుత‌మైన చిత్రం. అర్హ రోల్ చాలా అద్భుతంగా వ‌చ్చింది. లీడ్ కేర‌క్ట‌ర్ల‌న్నీ ఒక ఎత్తు, అర్హ రోల్ మ‌రో ఎత్తు. అందుకే పిల్ల‌లు, ఫ్యామిలీస్ ఈ క‌థ‌ను ఆస్వాదిస్తారని న‌మ్ముతున్నాను" అని చెప్పారు. 

" ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక నా జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయని అడుగుతున్నారు. నా జీవితం మారింద‌ని నేను అనుకోవడం లేదు. నేను ఆరు గంట‌ల దాకానే స్టార్‌ని. ఆ త‌ర్వాత నా జీవితం చాలా సాదాసీదాగా ఉంటుంది. నేను ఇక్క‌డివరకూ వస్తాన‌ని ఎప్పుడూ ఊహించ‌లేదు. నేను చేస్తున్న పాత్ర‌ల విష‌యంలో చాలా సంతృప్తికరంగా ఉన్నాను. యాక్ష‌న్ పాత్ర‌లు కూడా చేస్తున్నాను. 'ఫ్యామిలీమేన్‌ 2'లో నేను చేసిన కేర‌క్ట‌ర్ అలాంటిదే. ఎప్పుడూ స్క్రీన్ మీద ఎవ‌రో ఒక హీరో వ‌చ్చి కాపాడుతుంటే, బేల‌గా ఉండే పాత్ర‌లే కాదు, స‌బ‌ల‌గా కూడా న‌టించాలి. అలాంటి పాత్రలను ఆస్వాదిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News