Mumbai Indians: చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 158 రన్స్

Mumbai Indians set CSK 158 runs target
షార్ట్స్‌లో చూడండి
చెన్నై సూపర్ కింగ్స్ తో పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. ముంబయి జట్టులో హేమాహేమీ బ్యాట్స్ మెన్ ఉన్నప్పటికీ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. రోహిత్ శర్మ 21, ఇషాన్ కిషన్ 32, కామెరాన్ గ్రీన్ 12, సూర్యకుమార్ యాదవ్ 1, తిలక్ వర్మ 22, టిమ్ డేవిడ్ 31 పరుగులు చేశారు. ఆఖర్లో హృతిక్ షోకీన్ వేగంగా ఆడి 18 పరుగులు చేయడంతో ముంబయి స్కోరు 150 మార్కు దాటింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా 3, తుషార్ దేశ్ పాండే 2, మిచెల్ శాంట్నర్ 2, సిసాందా మగాలా 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Mumbai Indians
Chennai Super Kings
IPL

More Telugu News