Errabelli: మరో ఉద్యమానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధం కావాలి: ఎర్రబెల్లి

  • సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందన్న ఎర్రబెల్లి
  • తెలంగాణ కోసం కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకు వెళ్లారని కితాబు
  • ప్రభుత్వాన్ని కూల్చాలన్న కేంద్రం యత్నాలను కేసీఆర్ తిప్పికొట్టారని వ్యాఖ్య
Errabelli fires on Modi

సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టేందుకు తెలంగాణ ప్రజలంతా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదని మోదీ అనడం సిగ్గు చేటని విమర్శించారు. గతంలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ బిల్లులకు బీఆర్ఎస్ సహకరించలేదా? అని ప్రశ్నించారు.

 తెలంగాణను ముంచి అదానీకి దోచి పెడతామంటే తామెందుకు సహకరిస్తామని అన్నారు. పదో తరగతి పేపర్లు లీక్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకు వెళ్లారని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న బీజేపీ కుయుక్తులను కేసీఆర్ తెలివిగా తిప్పికొట్టారని అన్నారు.

More Telugu News