David Warner: బన్నీకి పుష్ప స్టయిల్లో బర్త్ డే విషెస్ చెప్పిన వార్నర్

David Warner And His Daughter Wish Actor Allu Arjun Happy Birthday
  • కూతురుతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యేక వీడియో పోస్ట్
  • పుష్ప2 కోసం ఎదురు చూస్తున్నానని వెల్లడి
  • ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న వార్నర్
తెలుగు ప్రజలు, ముఖ్యంగా సినీ, క్రికెట్ ప్రేమికులతో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు విడదీయలేని సంబంధం ఏర్పడింది. ఐపీఎల్ లో చాన్నాళ్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడిన వార్నర్ తనదైన శైలిలో వారిని అలరించాడు. గ్రౌండ్ లో బ్యాట్ తోనే కాకుండా సోషల్ మీడియాలో పోస్టులతో ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ చెబుతూ.. పాటలకు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో పాటలకు వార్నర్ వేసిన స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 

ఇప్పుడు వార్నర్ ఢిల్లీకి ఆడుతున్నా.. అల్లు అర్జున్ పై తన ప్రేమను చాటుకున్నాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పాడు. తన కూతురు ఇస్లా రోజ్ తో కలిసి పుష్ప స్టయిల్ లో విషెస్ తెలియజేస్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్  చేశాడు. ‘బిగ్ స్టార్, బిగ్ మ్యాన్ అల్లు అర్జున్ కు హ్యాపీ బర్త్ డే. పుష్ప2 కోసం మేం వేచి చూస్తున్నాం’ అని వార్నర్ చెప్పాడు. పక్కనే ఉన్న ఇస్లా హ్యాపీ బర్త్ డే పుష్ప అని క్యూట్ గా విషెస్ తెలిపింది. వార్నర్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
David Warner
IPL
Allu Arjun

More Telugu News