కర్ణాటక కాంగ్రెస్ దే: శరద్ పవార్
- కాంగ్రెస్ పార్టీకే కర్ణాటక ప్రజలు పట్టం కడతారన్న పవార్
- మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందని జోస్యం
- ప్రతిపక్షాలన్నీ ఏకం కాకుంటే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించలేమని వ్యాఖ్య
రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నాయని పవార్ గుర్తుచేశారు. త్వరలో కర్ణాటక కూడా ఈ జాబితాలో చేరుతుందని వివరించారు. రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళితే తప్ప వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించలేమని పవార్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని శరద్ పవార్ పేర్కొన్నారు.