దేవుడా.. పల్సర్ ను నీటిలో కూడా నడుపుతారా!
- నదిలో ఓ యువకుడి సాహసం
- పల్సర్ పై ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకి డ్రైవ్ చేస్తూ వెళ్లిన యువకుడు
- సంకల్పం ఉన్న చోట మార్గం ఉంటుందన్న అభిప్రాయం
నీరు తక్కువగా ఉన్నా, కింద ఇసుక ఉంటుంది. కనుక వాహనం నడపడం, నియంత్రించడంపై మంచి పట్టు ఉంటేనే ఇలాంటివి సాధ్యపడతాయి. ఈ యువకుడు పల్సర్ బైక్ తో చేసిన ఈ ఫీట్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. మోటార్ ఆక్టేన్ అనే ఆటోమొబైల్ బ్లాగ్, యూట్యూబ్ చానల్ ఈ వీడియోని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది.
సంకల్పం ఉంటే మార్గం ఉంటుందని కొటేషన్ పెట్టింది. ‘దీని గురించి ఆలోచించండి. ఇది తెలివైనదా లేక ప్రమాదకరమైనదా?’ అంటూ ప్రశ్న సంధించింది. ఈ వీడియోకి ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి. ఓ యూజర్ స్పందిస్తూ ఇది నిజంగా రిస్కీనే. నీరు ఎగ్జాస్ట్ లోకి వెళితే ఇంజన్ పరిస్థితి ఏమి కాను? అని ప్రశ్నించాడు. రిస్క్ ను అంచనా వేసుకుని తెలివిగా డ్రైవ్ చేశాడంటూ మరో యూజర్ మెచ్చుకున్నారు.