హీరో విశాల్ కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో విశాల్ కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

Madras High Court gives shock to actor Vishal
  • అన్బుచెళియన్ వద్ద రూ. 21.21 కోట్లను అప్పుగా తీసుకున్న విశాల్
  • డబ్బులు లేకపోవడంతో మ్యాటర్ సెటిల్ చేసిన లైకా ప్రొడక్షన్స్
  • లైకాతో ఒప్పందాన్ని ఉల్లంఘించిన విశాల్
ప్రముఖ తమిళ సినీ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు వారాల్లోపు రూ. 15 కోట్లను కోర్టు రిజిస్ట్రార్ పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే విశాల్ కు సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ ఉంది. గతంలో తన నిర్మాణ సంస్థ కోసం అన్బుచెళియన్ అనే ఫైనాన్సియర్ వద్ద నుంచి రూ. 21.29 కోట్లను అప్పుగా తీసుకున్నాడు. అయితే నిర్ణీత సమయంలో అప్పు తీర్చేందుకు డబ్బు లేకపోవడంలో లైకా ప్రొడక్షన్ ను సంప్రదించాడు. 

తన అప్పు తీరిస్తే.. అది తీరిపోయేంత వరకు తన సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇస్తానని లైకాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో విశాల్ అప్పులను లైకా ప్రొడక్షన్ క్లియర్ చేసింది. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం తన సినిమాల హక్కుల్ని లైకాకు ఇస్తూ వచ్చాడు విశాల్. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ 'వీరమే వాగై సూడుం' సినిమాను సొంతంగా రిలీజ్ చేశాడు. దీంతో లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. 

ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి సెషన్స్ కోర్టు రిజిస్ట్రార్ పేరుతో రూ. 15 కోట్లను మూడు వారాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ తీర్పును విశాల్ హైకోర్టులో అప్పీల్ చేశాడు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. రూ. 15 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే సినిమాలను థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని ఆదేశించింది.
Advertisement
Vishal
Kollywood
High Court

More Telugu News