Vidadala Rajini: ఏపీలో 267 మందికి కరోనా లక్షణాలు: మంత్రి విడదల రజని

AP Health Minister Vidadala Rajini talks about corona cases
  • దేశంలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల
  • గత 24 గంటల్లో 6 వేలకు పైగా కొత్త కేసులు
  • ఏపీలో గత రెండు వారాల్లో 15,096 పరీక్షలు నిర్వహించామన్న రజని
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని స్పందించారు. 

రాష్ట్రంలో రెండు వారాల్లో 15,096 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. 267 మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించామని తెలిపారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు, చికిత్స ఏర్పాట్ల కోసం పీహెచ్ సీలకు నిధులు ఇవ్వాలని మంత్రి రజని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

దేశంలో గడచిన 24 గంటల్లో 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
Vidadala Rajini
Corona Virus
New Cases
Andhra Pradesh
India

More Telugu News