Teja Sajja: 'హను మాన్' నుంచి 'హనుమాన్ చాలీసా' రిలీజ్!

  • ప్రశాంత్ వర్మ నుంచి 'హను మాన్'
  • సూపర్ హీరోగా కనిపించనున్న తేజ సజ్జ 
  • కథానాయికగా అమృత అయ్యర్ 
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
  • త్వరలోనే వివిధ భాషల్లో విడుదల
Hanu Man Movie Hanuman Chaleesa relesed

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'హను మాన్' సినిమా రూపొందింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యానిమేషన్ పాళ్లు ఎక్కువ. తేజ సజ్జ సూపర్ హీరోగా నటించిన ఈ సినిమా నుంచి ఆ మధ్య టీజర్ ను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. 

ఈ రోజున హనుమజ్జయంతి .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి 'హనుమాన్ చాలీసా'ను రిలీజ్ చేశారు. హనుమాన్ చాలీసాపై, హనుమాన్ కి సంబంధించిన యానిమేషన్ విజువల్స్ ను కట్ చేశారు. యానిమేషన్ తో కూడిన ఈ హనుమాన్ చాలీసా ఆకట్టుకునేలా ఉంది. 

తేజ సజ్జ జోడీగా అమృత అయ్యర్ నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో వినయ్ రాయ్ .. వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. అనుదీప్ దేవ్ - హరి గౌర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే  వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News