Botsa Satyanarayana: తెలంగాణలో పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్ పై ఏపీ మంత్రి బొత్స స్పందన

  • తెలంగాణలో పదో తరగతి పరీక్షలు
  • వాట్సాప్ లో ప్రత్యక్షమైన తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు
  • పేపర్ లీక్ చేసిన వారిని దేవుడు కూడా క్షమించడన్న బొత్స
  • ఏపీలో టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని వెల్లడి
Botsa responds on Tenth class question papers leak

ఇటీవల తెలంగాణలో పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు వాట్సాప్ లో దర్శనమివ్వడం తెలిసిందే. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పేపర్ల లీక్ కు పాల్పడిన వారిని దేవుడు కూడా క్షమించడని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం చేయడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. ఏపీలో పదో తరగతి పరీక్షలు పటిష్ఠంగా నిర్వహిస్తున్నామని బొత్స స్పష్టం చేశారు. గతేడాది పేపర్ లీక్ కు పాల్పడిన 75 మందిపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది పేపర్ లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని వివరించారు.

More Telugu News