'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' నుంచి ఎస్పీ చరణ్ సాంగ్ లాంచ్!

  • ప్రేమకథగా అన్నపూర్ణ ఫొటో స్టూడియో 
  • చైతన్యరావు జోడీగా లావణ్య లక్ష్మి 
  • సంగీతాన్ని అందించిన ప్రిన్స్ హేన్రీ 
  • జంధ్యాల స్టైల్లో సాగిన పాట    
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే అయినా ఆసక్తికరమైన కంటెంట్ తో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చాలా కథలు 1980 నేపథ్యంలో నడుస్తున్నాయి. అలాంటి ఒక సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి, 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' రెడీ అవుతోంది. 'ఇచ్చట ఫొటోలు అందంగా తీయబడును' అనేది ట్యాగ్ లైన్. 

చైతన్యరావు .. లావణ్య లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా నుంచి, తాజాగా 'రంగమ్మా .. రంగమ్మా' అనే ఫస్టు సింగిల్ ను ప్రియదర్శితో రిలీజ్ చేయించారు. 'కంటిచూపు నిన్నుతాకి పోనంటుందమ్మా .. కొంటె ఆశలేవో రేగి అదిరిందే బొమ్మ ..'  అంటూ ఈ పాట సాగుతోంది. ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందించిన ఈ పాటకి శ్రీనివాస మౌళి సాహిత్యాన్ని అందించగా, ఎస్పీ చరణ్ ఆలపించారు. 

ఈ పాట కూడా 1980 నేపథ్యంలో నడుస్తోంది. ఆ కాలం నటి కాస్ట్యూమ్స్ తోనే హీరో .. హీరోయిన్స్ ఇద్దరూ కనిపిస్తున్నారు. ఈ పాటను చూస్తుంటే ఒకప్పటి జంధ్యాల సినిమాలలోని పాటలు గుర్తుకొస్తున్నాయి. ఆ తరహాలోనే ఈ పాటను చిత్రీకరించారు. యశ్ రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమాకి, చందూ ముద్దు దర్శకత్వం వహించాడు.



More Telugu News

Chaitanya Rao Lavanya Lakshmi Annapurna Photo Studio