Hyderabad: మొబైల్ ఫోన్ తో పరీక్షా కేంద్రంలోకి వెళ్తున్న పోలీస్ కమిషనర్ ను ఆపేసిన మహిళా కానిస్టేబుల్

Woman constable stops CP Chauhan from entering SSC exam center with mobile
  • తెలంగాణలో కలకలం రేపుతున్న పేపర్ లీకేజీ వ్యవహారం
  • ఎల్బీ నగర్ లో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లిన సీపీ చౌహాన్
  • మొబైల్ ఫోన్ చేతిలో ఉండటంతో ఆపేసిన మహిళా కానిస్టేబుల్
తెలంగాణను పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం కుదిపేస్తోంది. దీంతో ఈ రోజు జరుగుతున్న ఇంగ్లిష్ పరీక్షకు అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు, హైదరాబాద్ ఎల్బీ నగర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడానికి రాచకొండ పోలీస్ కమిషనర్ సీపీ చౌహాన్ వెళ్లారు. ఆయన చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని పరీక్షా కేంద్రంలోకి వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. 

దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. ఉన్నతాధికారిని ఆపడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. అయితే, తన విధుల్లో భాగంగానే ఆమె అలా చేసిందంటూ సీపీ చౌహాన్ ఆమెను అభినందించారు. ఆమెకు మొబైల్ ఫోన్ ఇచ్చి పరీక్షా కేంద్రంలోకి తనిఖీకి వెళ్లారు. అంతేకాదు, డ్యూటీని సిన్సియర్ గా నిర్వహించిన ఆమెను అభినందించారు. ఆమెకు రివార్డును అందజేశారు. 
Hyderabad
CP Chouhan
Women Constable

More Telugu News