అసలు పుష్ప ఎక్కడ?.. అంటూ పుష్ప2 నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్
- రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా 20 సెకన్ల గ్లింప్స్ విడుదల
- ఈ నెల 7న అల్లు అర్జున్ పుట్టిన రోజున రాబోతున్న మరో సర్ ప్రైజ్
- ఆ రోజు 4.05 గంటలకు టీజర్ విడుదల చేయనున్న చిత్రం
'తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ' అంటూ న్యూస్ వచ్చినట్లు చూపించడం.. పుష్పకు మద్దతుగా పోలీస్ డౌన్ డౌన్ అంటూ అతని అభిమానులు గొడవ చేయడం కనిపించింది. పుష్ప ఎక్కడ? అనే శోధన త్వరలోనే ముగుస్తుంది. రాజ్యం ఏలే ముందు సాగే వేట గురించి ఈ నెల 7న సాయంత్రం 4.05 గంటలకు తెలుస్తుంది అని ట్యాగ్ లైన్స్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ నెల 7న బన్నీ పుట్టిన రోజు కావడంతో చిత్రం టీజర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. అంతకుముందు రష్మికకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆమె అందమైన ఫొటోను చిత్ర బృందం ట్విట్టర్ లో షేర్ చేసింది.