Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మారిన ట్విట్టర్ లోగో.. యూజర్లలో అయోమయం

Elon Musk changes Twitter logo to Dogecoin cryptocurrency image
Advertisement
  • కొంత సమయం పాటు మారిపోయిన ట్విట్టర్ లోగో
  • ట్విట్టర్ లోగోలో కనిపించిన డోజికాయిన్ కుక్క
  • దీంతో డోజికాయన్ ధర 20 శాతం ర్యాలీ
Advertisement
ఏంటిది ట్విట్టరేనా..? మంగళవారం ఉదయం ట్విట్టర్ తెరిచిన భారతీయ యూజర్లకు కలిగిన సందేహం ఇది. ఎందుకంటే ట్విట్టర్ అనగానే గుర్తుకు వచ్చేది బ్లూ రంగు పిట్ట. కానీ, ఈ పిట్ట కనిపించలేదు. దీని స్థానంలో క్రిప్టో కరెన్సీ డోజికాయన్ లోగోలో ఉండే డాగ్ కనిపించింది. చాలా మందికి ఇది ఏంటన్నది అర్థం కాలేదు. కానీ ఈ పరిణామం తర్వాత.. డోజికాయన్ ధర ఏకంగా 20 శాతం ర్యాలీ చేసింది. 

క్రిప్టోకరెన్సీ డోజి కాయిన్ కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్ నిర్వహిస్తున్నాడంటూ ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టి వేయాలంటూ, ఆయన చేసిన అభ్యర్థనను యూఎస్ జడ్జి కొట్టివేశారు. అనంతరం లోగో మార్చి మస్క్ తన నిరసనను ఇలా తెలిసేలా చేశారు. దీనిపై మీమ్స్ పెద్ద ఎత్తున నడిచాయి. ట్విట్టర్ యూజర్లు తెగ ట్రోల్ చేశారు.
Advertisement
Advertisement
Elon Musk
Twitter logo
changes
Dogecoin
cryptocurrency

More Telugu News