హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తూ.. దెందులూరు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా
- ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు, ముగ్గురు డ్రైవర్లు
- గాయపడిన 11 మందిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- ప్రమాద కారణంపై పోలీసుల ఆరా
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దెందులూరు, హైవే పెట్రోలింగ్ పోలీసులు బాధితులను అంబులెన్సులలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు బోల్తా పడడానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు.