Nani: 'దసరా' నుంచి పెళ్లికూతురుగా కీర్తి సురేశ్ డాన్స్ వీడియో రిలీజ్!

  • కీర్తి సురేశ్ నుంచి వచ్చిన 'దసరా'
  • వెన్నెల పాత్రలో మెప్పించిన కీర్తి సురేశ్
  • వసూళ్ల పరంగా దూసుకుపోతున్న సినిమా  
  • పెళ్లికూతురుగా ఆమె డాన్స్ బిట్ కి పడుతున్న విజిల్స్

Dasara Movie Update

నాని - కీర్తి సురేశ్ జంటగా నటించిన 'నేను లోకల్' భారీ విజయాన్ని సాధించింది. 2017లో వచ్చిన ఆ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఆ తరువాత సినిమాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో 'దసరా' రూపొందింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం నెల 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. రిలీజ్ రోజునే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 

ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో 'ధరణి' పాత్రను చేశాడు. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథలో కీర్తి సురేశ్ గ్రామీణ యువతిలా మాస్ లుక్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె పోషించిన 'వెన్నెల' పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

పెళ్లి కూతురుగా కీర్తి సురేశ్ ఈ సినిమాలో బ్యాండు మేళం ముందు మాస్ డాన్స్ చేస్తుంది. చూడటానికి ఇది చిన్న బిట్ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఇది ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా కనిపిస్తుంది. ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తుంది. అలాంటి ఆమె డాన్స్ వీడియోను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. దీనిని బట్టి ఈ బిట్ .. బీట్ ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యాయనేది అర్థం చేసుకోవచ్చు. 

More Telugu News