విజయ డెయిరీ పాల ధరలు పెంపు
- టోన్డ్ మిల్క్ లీటర్‌పై రూ.3 పెరిగిన ధర
- తాజా పెంపుతో రూ.58 కు చేరిన లీటర్ పాల ధర
- నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడంతో నిర్ణయం
- గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఉత్తర్వులు
సాధారణంగా పాల ధరలను పెంచే ముందు పాడి రైతులతో ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుంది. ఈసారి మాత్రం అలాంటి సమావేశం ఏదీ నిర్వహించకుండానే ధరలు పెంచేసింది. గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వహణ ఖర్చులు పెరగడంతో పాటు రవాణా, పాల సేకరణ ధరలు కూడా పెరగడంతో అనివార్యంగా ధరలు పెంచాల్సి వచ్చిందని విజయ డెయిరీ ఓ ప్రకటనలో వెల్లడించింది.