Sri Lakshmi: నాన్న పెద్ద హీరో .. అయినా ఇల్లుగడవని స్థితికి వచ్చాము: హాస్యనటి శ్రీలక్ష్మి

  • హాస్యనటిగా శ్రీలక్ష్మి స్థానం ప్రత్యేకం 
  • 100 సినిమాలు చేసిన అమర్ నాథ్ కూతురు ఆమె 
  • తండ్రి హవా తగ్గడం గురించి చెప్పిన శ్రీలక్ష్మి
  • రోజు గడవడం కష్టంగా ఉండేదని వ్యాఖ్య 
  • మరో మార్గం లేక సినిమాల్లోకి వచ్చానని వెల్లడి


Sri Lakshmi Interview

తెలుగు తెరపై హాస్యాన్ని పండించిన నటీమణులలో శ్రీలక్ష్మి ఒకరు. లేడీ ఆర్టిస్టులలో హాస్యానికి సంబంధించి ఆమె స్థాయిలో మెప్పించినవారెవరూ లేరు. జంధ్యాలగారి వల్లనే తనకి ఈ స్థాయి పేరు వచ్చిందని చెప్పే శ్రీలక్ష్మి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " మా నాన్నగారి పేరు అమర్ నాథ్. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ స్థాయి నటుడు ఆయన" అని అన్నారు. 

"మా నాన్నగారు దాదాపు 100 సినిమాలు చేశారు. ఆ తరువాత ఆయన హవా తగ్గుతూ వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయమంటే .. అలా చేయడం తనకి ఇష్టం లేదని అనేవారు. ఆ తరువాత ఆయన అనారోగ్యం బారిన పడటంతో ఇల్లు గడవడం కష్టమైంది. నేను సినిమాలు చేయాలనేది అమ్మ నిర్ణయం .. ఫీల్డ్ గురించి తెలుసును గనుక, నాన్నకి ఇష్టం ఉండేది కాదు" అని చెప్పారు. 

"నువ్వు సినిమాలు చేస్తే అందరం అన్నం తింటాం .. లేదంటే తలా ఇంత విషం తిందాం" అని అమ్మ తేల్చి చెప్పింది. "ఇప్పటి వరకూ మిమ్మల్ని గుప్పెట్లో పెట్టి చూసుకున్నాను .. ఇప్పుడు వదిలేస్తున్నాను" అని నాన్న అన్నారు. మా అక్కయ్యకి యాక్టింగ్ ఇష్టం లేదు .. తమ్ముడు రాజేష్ అప్పటికి చాలా చిన్నోడు. అందువలన నేను సినిమాల్లోకి రాక తప్పలేదు" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News