Jagan: రేపు వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం

CM Jagan will held meeting with YCP MLAs tomorrow
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు తన పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వారికి కర్తవ్య బోధ చేయనున్నారు. 

ఈ సమావేశంలో నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొననున్నారు. గడప గడపకు కార్యక్రమంలో అందిన వినతుల పరిష్కారం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక, జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమంపైనా సీఎం జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.
Go Back to Shorts
Jagan
MLAs
YSRCP
Andhra Pradesh

More Telugu News