Small Savings Schemes: ప్రభుత్వ చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడికి పాన్, ఆధార్ తప్పనిసరి

  • కేవైసీ నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన
  • చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడికి పాన్, ఆధార్ తప్పనిసరి 
  • గతంలో పెట్టుబడి పెట్టినవారు సెప్టెంబర్ 30 లోపు పాన్, ఆధార్ సమర్పించాలని సూచన
Central govt makes pan card aadhar mandatory for investing in small savings schemes

ప్రభుత్వ చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి కేంద్రం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై ఈ పథకాల్లో పెట్టుబడులకు కేవైసీ నిబంధనల కింద పాన్, ఆధార్ కార్డును సమర్పించడం తప్పనిసరి చేసింది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ స్కీమ్ తదితర పథకాలన్నిటీకీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

కొత్తగా ఈ పథకాల్లో చేరే వారు ఆరు నెలల లోపు తమ పాన్, ఆధార్ వివరాలు సమర్పించాలని పేర్కొంది. ఆధార్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుని, కార్డు జారీ కోసం వేచిచూస్తున్న వారు తమ ఆధార్ ఎన్‌రోల్మెంట్ నెంబర్ ఇస్తే సరిపోతుందని పేర్కొంది. 


More Telugu News