Samantha: ఆ బాధ నుంచి నేను పూర్తిగా కోలుకోలేదు: సమంత

Samantha opines on her dark stage
  • నాగచైతన్యతో సమంత వైవాహిక బంధం విచ్ఛిన్నం
  • తాజాగా శాకుంతలం చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో సమంత బిజీ
  • ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
  • బాధలు ఎప్పటికీ ఉండిపోవని వెల్లడి
అందాల నటి సమంత తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలపై స్పందించింది. 

వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడంపై ఆమె మాట్లాడుతూ, అవి చీకటి రోజులని పేర్కొంది. ఆ బాధ నుంచి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమంత వెల్లడించింది. క్లిష్టమైన పరిస్థితులు ఎదురుకావడంతో మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని, పిచ్చి ఆలోచనలు వచ్చేవని వివరించింది. 

అయితే, ఆ కష్టకాలంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు వెన్నంటి ఉన్నారని వెల్లడించింది. వాళ్ల అండ లేకపోతే ఇప్పుడిలా ఉండేదాన్ని కాదని సమంత పేర్కొంది. నాకు మంచి రోజులు వస్తాయా? అని మా అమ్మను రోజూ అడుగుతుండేదాన్నని గుర్తు చేసుకుంది. బాధలు ఎప్పటికీ ఉండిపోవని, అయితే బాధలను ఎదుర్కొన్నప్పుడే మనలో ధైర్యం పెరుగుతుందని తెలిపింది.
Samantha
Marital Life
Actress
Tollywood

More Telugu News