రెండు నెలల ముందుగానే జైలు నుంచి ఈరోజు విడుదలవుతున్న సిద్దూ
- పాటియాలా జైల్లో ఏడాది జైలు శిక్షను అనుభవిస్తున్న సిద్దూ
- సత్ప్రవర్తన కారణంగా 48 రోజుల శిక్ష తగ్గింపు
- మధ్యాహ్నం జైలు వెలుపల మీడియాతో మాట్లాడనున్న సిద్దూ
ఈ కేసులో వాస్తవానికి సిద్దూకి ఏడాది జైలు శిక్షను కోర్టు విధించింది. దీని ప్రకారం ఆయన మే నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే, జైల్లో ఆయన సత్ప్రవర్తన కారణంగా ముందుగానే 10 నెలల్లోనే విడుదలవుతున్నారు. ఆయనకు 48 రోజుల శిక్షాకాలం తగ్గింది. మరోవైపు జైలు నుంచి సిద్దూ విడుదల కానున్న నేపథ్యంలో ఆయన అభిమానులు జైలు వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.