Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

  • మూడు రోజులుగా కనిపిస్తున్న ధరల తగ్గుదలకు బ్రేక్
  • నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు
  • పసిడి బాటలోనే వెండి
  • అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులతో ధరల్లో పెరుగుదల
Gold price rise in Telugu states

గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. దీంతో వినియోగదారులు కాస్తంత నిరాశ చెందారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్నమెంట్ బంగారం ధర రూ. 200 రూపాయలు పెరగ్గా.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 మేర పెరిగింది. దీంతో.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700కు చేరుకోగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.59,970కు చేరుకుంది. 

ఇక పసిడి బాటలోనే పయనిస్తున్న వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ. 75,700కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా పసిడి ధరల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ధరలు తగ్గిన సమయంలోనే పసిడి కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.

More Telugu News