Karthi: లోకేశ్ కనగరాజ్ స్పీడ్ మామూలుగా లేదే!

  • కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా లోకేశ్ కనగరాజ్
  • కమల్ మనసును గెలిచిన దర్శకుడు
  • విజయ్ తో రెండో సినిమాగా 'లియో'
  • జోరుగా జరుగుతున్న షూటింగ్ 
  • లైన్లో వెయిట్ చేస్తున్న స్టార్ హీరోలు
Leo movie update

కోలీవుడ్లో కమల్ .. రజనీ ఇద్దరూ కూడా కొంతకాలంగా యంగ్ డైరెక్టర్లకు అవకాశాలిస్తూ వెళుతున్నారు. అయితే ఆ ఇద్దరినీ ఒప్పించడం అంత తేలికైన విషయమేం కాదు. అలాంటిది కమల్ ఒక యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడమే కాకుండా, అతణ్ణి నేరుగా రజనీకి పరిచయం చేయడం విశేషం. ఆ డైరెక్టర్ పేరే లోకేశ్ కనగరాజ్. 

'ఖైదీ'.. 'మాస్టర్' .. 'విక్రమ్' సినిమాలతో లోకేశ్ కనగరాజ్ కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఆయనతో 'ఖైదీ' సీక్వెల్ చేయడానికి కార్తి .. 'విక్రమ్' సీక్వెల్ చేయాలని కమల్ ఉత్సాహంతో ఉన్నారు. ఈ లోగానే ఆయనతో 'లియో' సినిమాను విజయ్ మొదలుపెట్టేశాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన కశ్మీర్ షెడ్యూల్ ను లోకేశ్ పూర్తి చేశాడు. 

ఆ తరువాత షెడ్యూల్ ను లోకేశ్ చెన్నైలో ప్లాన్ చేశాడని అంటున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. ఆ తరువాత హైదరాబాద్ లోను మరో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. రెండు మూడు నెలల్లో షూటింగు పార్టును పూర్తిచేసి, ముందుగా చెప్పిన ప్రకారమే అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విజయ్ జోడీగా త్రిష అలరించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News