Swara Bhaskar: ఎంపీగా ప్రజ్ఞా ఠాకూర్‌ ఎలా కొనసాగుతున్నారు?: నటి స్వర భాస్కర్

How Pragya Thakur continuing as MP says actor Swara Bhaskar
  • రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై స్వర భాస్కర్ మండిపాటు
  • పేలుళ్ల కేసులో నిందితురాలు ప్రజ్ఞా ఠాకూర్‌ స్వేచ్ఛగా ఉన్నారని విమర్శ
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటని ఆరోపణ
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై వేటు పడిన నేపథ్యంలో బీజేపీపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్ సినీ నటి స్వర భాస్కర్ కూడా మండిపడ్డారు. దేశాన్ని దోచుకుంటున్న వారిని ఉద్దేశించి రాహుల్ అన్న మాటల్లో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ ఇప్పటికీ ఎంపీగా ఎలా కొనసాగుతున్నారని నిలదీశారు. 

మోదీ చెపుతున్న అచ్చే దిన్ అంటే ఉగ్రవాద కేసులో నిందితురాలు స్వేచ్ఛగా ఉండటమేనా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత పార్లమెంటుకు అనర్హుడు అని గతంలో టర్కీ, రష్యాల నుంచి వార్తలు వచ్చాయని... ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులే నెలకొన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, దాని వ్యవస్థలు కలిపి ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటిగా మారిందని చెప్పారు.
Swara Bhaskar
Bollywood
Rahul Gandhi

More Telugu News