Nara Lokesh: లోకేశ్ పాదయాత్రలో కిలోమీటర్ల మేర జనం.. వీడియో వైరల్!

huge crowd in Lokesh Yuva galam Padayatra Video goes viral
  • 50వ రోజుకు చేరుకున్న లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర
  • ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలో నడుస్తున్న టీడీపీ యువ నేత
  • వేలాదిగా హాజరవుతున్న జనం..
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర  50వ రోజుకు చేరుకుంది. మూడు రోజుల విరామం తర్వాత శనివారం ఉదయం పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి యాత్రను లోకేశ్ ప్రారంభించారు. అంతకుముందు ‘సెల్పీ విత్ లోకేశ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనని కలవడానికి వచ్చిన ప్రజలతో ఉదయమే ఫోటోలు దిగుతున్నారు.

మరోవైపు లోకేశ్ పాదయాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. ఆయన వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాదయాత్రలో రోడ్డు వెంట కిలోమీటర్ల కొద్దీ వేలాది మంది జనం కనిపించారు.
Nara Lokesh
Yuva Galam Padayatra
Selfy with Lokesh
huge crowd
TDP
puttaparthi

More Telugu News