ఈ మహిళా టీసీ ఎవరినీ విడిచి పెట్టదు.. ముక్కు పిండి మరీ రూ.కోటి ఫైన్ వసూలు
- సదరన్ రైల్వేలో ప్రయాణికులను హడలెత్తిస్తున్న మహిళా టీసీ
- నిబంధనలు పాటించని వారికి రూ.1.03 కోట్ల జరిమానా
- భారీ ఆదాయం రాబట్టిన తొలి మహిళా చెకింగ్ ఉద్యోగికి ప్రశంసలు
దీనిపై రేల్వే శాఖ ట్వీట్ చేసింది. ‘‘విధుల నిర్వహణ పట్ల ఆమె అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు. సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి రోసలిన్ అరోకియా మేరీ.. భారతీయ రైల్వేలో రూ.1.03 కోట్ల జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టికెట్ చెకింగ్ ఉద్యోగి’’ అని అందులో పేర్కొంది. ఉద్యోగాన్ని సిన్సియర్ గా చేస్తున్న మేరీకి ట్విట్టర్ లో యూజర్లు పెద్ద సంఖ్యలో అభినందనలు చెబుతున్నారు.