tspsc: పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్

  • ప్రవీణ్ తో పాటు గ్రూప్ 1 పరీక్ష రాసిన మరో పదిమంది ఉద్యోగులు 
  • ప్రిలిమ్స్ లో వారంతా అర్హత సాధించడంపై అనుమానాలు
  • వారిని ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సిట్ అధికారులు
Another twist in tspsc paper leake case

టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. లీకేజీ సూత్రధారి ప్రవీణ్ తో పాటు సంస్థలో పనిచేస్తున్న మరో పదిమంది ఉద్యోగులు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినట్లు సిట్ విచారణలో బయటపడింది. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా, ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ పదిమంది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో క్వాలిఫై కావడం గమనార్హం.. అయితే, గ్రూప్ 1 రాయడానికి వీరు కమిషన్ అధికారుల అనుమతి తీసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ పరీక్ష రాయడానికి సెలవు పెట్టారా లేక ఉద్యోగం చేస్తూనే పరీక్షకు హాజరయ్యారా అనేది తెలియాల్సి ఉంది.

పేపర్ లీకేజీపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు ఇప్పటికే తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కస్టడీలో ఉన్న నిందితులను ప్రశ్నించే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కమిషన్ ఉద్యోగులు గ్రూప్ 1 పరీక్ష రాయడం, ఏకంగా పదిమంది మెయిన్స్ కు అర్హత సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా సొంతంగా చదివి పరీక్ష రాశారా లేక గ్రూప్ 1 పేపర్ ముందే అందుకోవడం వల్ల పరీక్ష పాసయ్యారా అనేది తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పరీక్ష రాసిన ఆ పదిమందినీ విచారించాలని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News