venniradai nirmala: ఒక హీరో తాగేసి వచ్చి ఏం చేశాడంటే: సీనియర్ నటి వెన్నిరాడై నిర్మల

Vennira Adai Nirmala Interview
  • 100 సినిమాలకి పైగా నటించిన 'వెన్నిరాడై' నిర్మల 
  • తనని లక్కీ హీరోయిన్ గా భావించేవారని వెల్లడి 
  • శోభన్ బాబు గారు చాలా డీసెంట్ అని వ్యాఖ్య 
1960 - 70లలో అందాల కథానాయికగా వెన్నిరాడై నిర్మల ఒక వెలుగు వెలిగారు. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ భాషల్లో ఆమె 100 కి పైగా సినిమాలు చేశారు. చాలా కాలం తరువాత ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కూడా ఆమె అడపా దడపా మాత్రమే తెరపై కనిపిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

''రామానాయుడు గారు అప్పట్లో నన్ను లక్కీ హీరోయిన్ గా భావించేవారు. ఆయన నిర్మించిన 'పాప కోసం' సినిమా సూపర్ హిట్ అయింది. అందువల్లనే ఆయన 'కలిసుందాం రా' సినిమాకి కూడా నన్ను గుర్తుపెట్టుకుని పిలిపించి చేయించారు. ఇక ఎస్వీ రాంగారావుగారితోను కలిసి నటించాను .. ఆయన రాజసమే వేరు. నేను యాక్ట్ చేసిన హీరోల్లో శోభన్ బాబుగారు చాలా డీసెంట్. 

అప్పట్లో షూటింగు పూర్తయిన తరువాత ఒక హీరో తాగేసి నా రూమ్ కి వచ్చాడు. తలుపు తీయమని గొడవచేశాడు. నేను తలుపు తీయకపోవడంతో ఆ రాత్రంతా అరుస్తూ తలుపు కొడుతూనే ఉన్నాడు. ఆ మరునాడు ఉదయం ఆ సినిమా చేయనని చెప్పేసి వచ్చాను. అలాగే నాకు మర్యాద ఇవ్వడం లేదని గ్రహించిన మరుక్షణమే నేను షూటింగు నుంచి తప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి'' అని చెప్పుకొచ్చారు.

venniradai nirmala
actress
Tollywood

More Telugu News