Police: నెట్ లో ఆ కంటెంట్ చూసినా, వెతికినా జైలుకే.. తెలంగాణ పోలీసుల హెచ్చరిక

Browsing child porn will land you in jail warns telangana police
  • చైల్డ్ ఫోర్నోగ్రఫీని దొంగతనంగా చూస్తున్నవారి సంఖ్య 
    పెరుగుతున్న వైనం
  • వారిపై నిఘా పెడుతున్న జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 
  • రాష్ట్రంలో నెల రోజుల్లోనే 43 మంది అరెస్ట్
ఇంటర్నెట్ లో చిన్న పిల్లల అశ్లీల (చైల్డ్‌పోర్న్‌) వీడియోలు, ఫొటోలు, ఇతర అభ్యంతరకర కంటెంట్‌ పదే పదే చూసినా, షేర్ చేసినా జైలుకెళ్లడం ఖాయమని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. వివిధ ఆన్‌లైన్‌ వేదికల ద్వారా చైల్డ్‌పోర్నోగ్రఫీని దొంగతనంగా చూస్తున్న వారిని గుర్తించి జైళ్లకు పంపుతున్నారు. బాలల లైంగిక వేధింపు అంశాలను, వీడియోలను, ఫొటోలను సర్క్యూలేట్‌ చేసేవారిపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) అందించే సమాచారం ఆధారంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో నెల వ్యవధిలోనే 43 మందిని అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పీడోఫైల్స్‌ (పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ ఉండటం) స్వభావం ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. 

ఈ క్రమంలో చిన్నారులపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌ (సీశామ్‌)ను ఆన్‌లైన్‌లో చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు సైతం దీనికి అలవాటు పడుతున్నట్టు గుర్తించారు. అయితే, మనదేశంలో సీశామ్‌ ఫైల్స్‌ చట్టవిరుద్ధమని,  సెక్షన్‌ 67(బి), ఐటీ చట్టం 2000 ప్రకారం శిక్షార్హులని తెలంగాణ సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు.ఇలాంటి కేసుల్లో అన్ని ఫోన్ల ఐపీ అడ్రస్‌లు జాతీయస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోలీసులకు తెలిసిపోతాయన్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపితమైతే ఏడేండ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉన్నదని స్పష్టం చేశారు.
Police
Telangana
Browsing
child porn
jail

More Telugu News