Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద కేసు నమోదు

  • ఓ కేసులో విచారణ కోసం కోర్టుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్
  • ఇమ్రాన్ ఖాన్ రాకతో చెలరేగిన పీటీఐ కార్యకర్తలు
  • కోర్టు వద్ద విధ్వంసం
  • 25 మంది భద్రతా సిబ్బందికి గాయాలు
  • 17 మంది పీటీఐ నేతలపై ఎఫ్ఐఆర్
Police files terrorism case against Pakistan former prime minister Imran Khan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తాజాగా ఉగ్రవాద కేసు నమోదైంది. ఇమ్రాన్ పై ఓ కేసు విచారణ సందర్భంగా ఇస్లామాబాద్ లోని కోర్టు సముదాయం వద్ద పీటీఐ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయని, పీటీఐ కార్యకర్తలు భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. 

ఓ కేసు విచారణ నిమిత్తం ఇమ్రాన్ ఖాన్ లాహోర్ నుంచి ఇస్లామాబాద్ చేరుకోగానే, పీటీఐ కార్యకర్తలు కోర్టు గేటును, పోలీస్ చెక్ పోస్టును ధ్వంసం చేశారని పోలీసులు ఆరోపించారు. ఈ సందర్భంగా 17 మంది పీటీఐ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో పీటీఐ కార్యకర్తలతో పాటు 25 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయని వివరించారు. ఇమ్రాన్ ఖాన్ పై ఇప్పటికే 9 కేసులు ఉండగా, ఆయా కేసుల్లో అరెస్ట్ చేయవద్దంటూ ఇస్లామాబాద్ న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News