Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరికాసేపట్లో మహిళా కమిషన్ ముందుకు బండి సంజయ్

Bjp state president to appear before womans commission over remarks on MLC kavitha
Advertisement
  • ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • సంజయ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్
  • సుమోటోగా కేసును తీసుకుని నోటీసులు
  • సంజయ్ ఏ వివరణ ఇస్తారన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ
Advertisement
ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కాసేపట్లో మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. కవిత ఈడీ విచారణపై ఇటీవల స్పందించిన ఆయన.. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. కేసును సుమోటోగా తీసుకున్న కమిషన్ ఈ నెల 13న తమ ముందు హాజరు కావాలంటూ సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే.. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున 18న హాజరవుతానని ఆయన కమిషన్‌ను కోరారు. ఈ నేపథ్యంలో నేడు కమిషన్ ముందుకు వెళ్లనున్న సంజయ్ ఏం వివరణ ఇస్తారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. 

ఇదిలా ఉంటే బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పార్టీ శ్రేణులు పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇక సంజయ్ ఈ ఉదయం 11.00 గంటలకు మహిళ కమిషన్ ముందు హాజరవుతారని తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Kavitha
Band

More Telugu News